polling: 13 రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు 39.1 శాతం ఓటింగ్

  • తాజా బులెటిన్ విడుదల చేసి కేంద్ర ఎన్నికల సంఘం
  • 13 రాష్ట్రాల్లో 88 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
  • గత సార్వత్రిక ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంటకు 40 శాతం పోలింగ్
Nearly 40 Percent Voter Turnout Recorded Across 13 States

ఈ రోజు జరుగుతున్న లోక్ సభ రెండో దశ పోలింగ్ లో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 39.1 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల్లో 12 వందల మంది పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. మణిపూర్, ఛత్తీస్ గఢ్, త్రిపుర రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 53 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 31 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఈ 88 సీట్లలో కూడా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైంది. 

    కేరళలోని మొత్తం 20 సీట్లు, కర్ణాటకలో 28 సీట్లలో 14 సీట్లకు, రాజస్థాన్ లో 13 సీట్లకు, మహారాష్ట్రలో 8 సీట్లకు, ఉత్తర ప్రదేశ్ లో 8 సీట్లకు, మధ్యప్రదేశ్ లో 7 సీట్లకు, అసోం, బీహార్ రాష్ట్రాల్లో ఐదేసి సీట్లకు, చత్తీస్ గఢ్ , పశ్చిమ బెంగాల్ లో చెరో మూడు సీట్లకు మణిపూర్, త్రిపుర, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కోసీటుకు శుక్రవారం పోలింగ్ జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 

  రెండవ దశ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నేత తేజస్వీ సూర్య, హేమమాలిని, అరుణ్ గావ్లీ, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిధరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ , హెచ్ డీ కుమారస్వామి వంటి ప్రముఖులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  గత శుక్రవారం  102 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 65.5 గా ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. 

More Telugu News